నిన్నే నిన్నే అల్లుకొని కుసుమించె గంధం నేనవని నన్నే నీలో కలుపుకొని కొలువుంచె మంత్రం నీవవని ప్రతి పూట పువ్వై పుడతా నిన్నే చేరి మురిసేలా ప్రతి అడుగు కోవెలనౌతా నువ్వె నెలవు తీరేలా నూరెళ్ళు నన్ను నీ నివేదనవని
నిన్నే నిన్నే అల్లుకొని కుసుమించె గంధం నేనవని
చరణం: 1 వెన్ను తట్టి మేలు కొలిపిన వేకువ నువ్వే కన్నె ఈడు నేను మరచిన వేళవు నువ్వే వేలు పట్టి వెంట నడిపిన దారివి నువ్వే తాళి కట్టి ఏలవలసిన దొరవూ నువ్వే రమని చెరను దాటించె రామ చంద్రుడా రాధ మదిని వేదించె శ్యామ సుందరా మనసిచ్చిన నెచ్చెలి ముచ్చట పచ్చగ పండించరా