గలగల పారుతున్న గోదారిలా రెపరెపలాడుతున్న తెరచాపలా ఈ చల్లనీ గాలిలా.. ఆ పచ్చనీ పైరులా ఈ జీవితం సాగనీ.. హాయిగా.. హే.. గలగల పారుతున్న గోదారిలా
అందాల పందిరి వేసే ఈ తోటలూ.. ఆనింగి అంచులు చేరే ఆ బాటలూ నాగలి పట్టే రైతులూ.. కడవలు మోసే కన్నెలూ బంగరు పంటల సీమలూ.. చూడరా.. హే.. గలగల పారుతున్న గోదారిలా రెపరెపలాడుతున్న తెరచాపలా ఈ చల్లనీ గాలిలా.. ఆ పచ్చనీ పైరులా ఈ జీవితం సాగనీ.. హాయిగా.. హే.. గలగల పారుతున్న గోదారిలా
దేశానికాయువు పోసే ఈ పల్లెలూ.. చల్లంగ ఉండిననాడే సౌభాగ్యమూ సత్యం ధర్మం నిలుపుటే.. న్యాయం కోసం పోరుటే పేదల సేవలు చేయుటే.. జీవితం.. హే.. గలగల పారుతున్న గోదారిలా రెపరెపలాడుతున్న తెరచాపలా ఈ చల్లనీ గాలిలా.. ఆ పచ్చనీ పైరులా ఈ జీవితం సాగనీ.. హాయిగా.. హే.. గలగల పారుతున్న గోదారిలా