కారున్న మైనరు.. కాలం మారింది మైనరు.. ఇక తగ్గాలి మీ జోరూ మా చేతికి వచ్చాయి తాళాలు.. మా చేతికి వచ్చాయి తాళాలు.. హత్తెరి కారున్న మైనరు.. కాలం మారింది మైనరు.. ఇక తగ్గాలి మీ జోరూ మా చేతికి వచ్చాయి తాళాలు.. మా చేతికి వచ్చాయి తాళాలు
1 రొడ్డెంత బాగుంటే.. మీకంత హుషారు దాన్నేసి నోళ్ళ మీదనే.. ఎక్కించి పోతారు రొడ్డెంత బాగుంటే.. మీకంత హుషారు దాన్నేసి నోళ్ళ మీదనే.. ఎక్కించి పోతారు మేమెక్కి కూచుంటే.. మీరెమైపోతారూ మేమెక్కి కూచుంటే.. మీరెమైపోతారు మా పక్క నింత చోటిస్తే చాలంటారు.. హత్తెరి కారున్న మైనరు.. కాలం మారింది మైనరు ఇక తగ్గాలి మీ జోరూ మా చేతికి వచ్చాయి తాళాలు.. మా చేతికి వచ్చాయి తాళాలు.. హత్తెరి
2 పదునైన కన్నెపిల్ల ఎదురైతే.. పళ్ళికిలించి ప్రేమపాఠాలెన్నో చెప్తారూ పదునైన కన్నెపిల్ల ఎదురైతే.. పళ్ళికిలించి ప్రేమపాఠాలెన్నో చెప్తారూ పెళ్ళాడమంటేనే.. గొప్పోళ్ళ మంటారూ పెళ్ళాడమంటేనే.. గొప్పోళ్ళ మంటారూ మా ప్రేమముందు బీదోళ్ళు మీరే నంటాను కారున్న మైనరు.. కాలం మారింది మైనరు.. ఇక తగ్గాలి మీ జోరూ మా చేతికి వచ్చాయి తాళాలు.. మా చేతికి వచ్చాయి తాళాలు
3 నీ వెంట నేనొస్తే.. నీ డబ్బు చూస్తాను నా వెంట నువ్వు వచ్చావా.. లోకాన్నే చూస్తావు లోకాన్నీ చూడందే.. నువు మనిషివి కాలేవు లోకాన్నీ చూడందే.. నువు మనిషివి కాలేవు మావాడివైతే కలకాలం బతికుంటావు.. హత్తెరి కారున్న మైనరు.. కాలం మారింది మైనరు.. ఇక తగ్గాలి మీ జోరూ మా చేతికి వచ్చాయి తాళాలు.. మా చేతికి వచ్చాయి తాళాలు.. హత్తెరి