ప్రియతమ తమ సంగీతం విరిసె సుమములై వసంతం అడుగుల సడె మయూరం అడుగుకొ వయ్యారం పలికిన పదం సరాగం జరిగెలె పరాగం ప్రియతమ తమ సంగీతం విరిసె సుమములై వసంతం
రేగె రాగలన్ని నాలొ ఉయ్యాలూగెలే మళ్ళి మళ్ళి నన్ను మత్తెక్కిస్తున్నాయిలే రేగె రాగలన్ని నాలొ ఉయ్యాలూగెలే మళ్ళి మళ్ళి నన్ను మత్తెక్కిస్తున్నాయిలే నాలోన లీలగా నాదస్వరాలుగా పూసింది లాలసా పున్నాగలా రేయంత ఎండాయె నా గుండెలో రేరాని వెన్నెల్లలో ఈ మోహమెందాక పోతున్నదో ఈ దేహమింకేమి కానున్నదో వలపులె పిలువగ
ప్రియతమ తమ సంగీతం విరిసె సుమములై వసంతం
పూలె తేనైపోయి నాలొ వాగై పొంగెలే నిన్నె నిన్నె కోరి నాట్యాలనె చేసెలే పూలె తేనైపోయి నాలొ వాగై పొంగెలే నిన్నె నిన్నె కోరి నాట్యాలనె చేసెలే నా పాణ్పు పంచుకో ఈ బాధ తీర్చిపో శివరాతిరవ్వనీ ఈ రాతిరీ తేనెళ్ళు పొంగాలి చీకట్లలో కమ్మని కౌగిళ్ళలో నీ తోడు కావాలి ఈ జన్మకీ నే నీడనౌతాను నీ దివ్వెకీ పెదవులో మధువుల
ప్రియతమ తమ సంగీతం విరిసె సుమములై వసంతం అడుగుల సడె మయూరం అడుగుకొ వయ్యారం పలికిన పదం సరాగం జరిగెలె పరాగం ప్రియతమ తమ సంగీతం విరిసె సుమములై వసంతం