వద్దంటూనే నిన్ను వద్దంటూనే వద్దకొచ్చానురా వద్దకొచ్చానురా.. కాదంటూనే నిన్ను కాదంటూనే ప్రాణమిచ్చేంతగా నాకు నచ్చావురా.. ఉన్న మాటిది నిజమున్న మాటిది అన్న మాటిది మనసన్న మాటిది ప్రేమగా నిను చేరగా ఆరాట పడుతోంది
నాలోనే ఉన్నా తెలియలేదు ఏ సడి లేని అలజడి గుండెల్లో నిండి నిండి ఉప్పొంగి పొంగి పొంగి నీవైపు పరుగులు తీసిందిలా ఓ మాట నన్ను అడగలేదు అదుపు లేని మనసిది నువ్వంటే నచ్చి నచ్చి ఎంతెంతో ఇష్టం వచ్చి నీ చెంత చేరుకుంది ఈ రోజిలా చూస్తూ చూస్తూనే నేను నీ సొంతమైనా గుర్తించలేదే కన్ను ఏ కొంచెమైనా నిన్నల్లో నేనే నేనా నిన్నిల్లా ప్రేమిస్తున్నా నీ మాయ దయ వలనా..
ఐ ఆమ్ ఇన్ లవ్ బేబీ ఐ ఆమ్ ఇన్ లవ్ బేబీ ఐ ఆమ్ ఇన్ లవ్ బేబీ ఐ ఆమ్ ఇన్ లవ్ ఐ ఆమ్ ఇన్ లవ్ బేబీ ఐ ఆమ్ ఇన్ లవ్ బేబీ ఐ ఆమ్ ఇన్ లవ్ బేబీ ఐ ఆమ్ ఇన్ లవ్
నీ పేరు పలికే పెదవి నేడు పులకరింతల పువ్వయ్యింది నీలో అదేదో ఉంది నన్నేదో చేసేసింది నా చుట్టూ లోకం నీలా కనిపిస్తోంది నీ జంట నడిచే అడుగు చూడు గాల్లోన తేలే గువ్వయింది నువ్వంటే తెలిసే కొద్ది నీలో నిను కలిసే కొద్ది నిన్నింకా ప్రేమించాలి అనిపిస్తోంది నీ నీడలోనే నాకు ఆనందముంది నూరేళ్ళకూ నేను నీలోన బంధీ ఏ ఒక్క క్షణమిక నీ తోడు విడువక నీలోన సగమవనా....