తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా కళ్ళు మూసి ఎటో వెళ్లిపోకయ్యా నన్ను కన్నా తండ్రి ఇలా రావయ్యా కడుపులోనే ఉండక ఈ పుడమికెలా వస్తివయ్యా సంకనెత్తుకున్నంత సేపు లేవయ్యా ఇంతలోనే ఏమయ్యావో చెప్పయ్యా
నీ సెమట తడి ఇంకా ఇంకనేలేదయ్యా ఈ తోటనంతా తడిమి సుడయ్యా నీ నవ్వు సడిలేక గూడు సిన్నబోయెనయ్యా ఇంతలోనే ఋణము తీరే నీకయ్యా మట్టిని చిల్చుకొచ్చే విత్తనమై రావయ్యా సావుని కూడా సంపే సత్తువ నీదయ్యా అష్టదిక్కులన్నీ సుట్టుముడుతున్నా ఇట్టేనెట్టి సప్పున ఇంటికి రావయ్యా
తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా కళ్ళు మూసి ఎటో వెళ్లిపోకయ్యా నన్ను కన్నా తండ్రి ఇలా రావయ్యా
కన్నొదిలి చూపెల్లీ మసకేసి పోయేలే గుండెల్లో మంట నిన్ను చూపేనా... నన్నొదిలి నువ్వెళ్ళి కోడి కట్టి ప్రాణాలే నా ఆశకాయువింకా ఇంకా మిగేలేరా కటిక నిజం నీదని ఏ రుజువెదురవని నమ్మాలంటే కష్టం కదా నాయనా ఆకైనా అల్లాడదే చూడయ్యా... నువు రాకుంటే గాలాడదే కన్నయ్యా
తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా కళ్ళు మూసి ఎటో వెళ్ళిపోకయ్యా.... నన్ను కన్న తండ్రి ఇలా రావయ్యా కడుపులోనే ఉండక ఈ పుడమికెలా వస్తివయ్యా సంకనెత్తుకున్నంత సేపు లేవయ్యా... ఇంతలోనే ఏమయ్యావో సెప్పయ్యా