కోటి జన్మల ఆనందం... శతకోటి జన్మల అనుబంధం... కోటి జన్మల ఆనందం శతకోటి జన్మల అనుబంధం నీవు నేనై వెలిశాము నేడు మళ్ళీ కలిశాము రాజా... ఓ నా రాజా ... రాజా.. ఓ నా రాజా రాణీ... ఓ నా రాణీ ..రాణీ... ఓ నా రాణీ...
నీ సుతిమెత్తని ఒడిలో పవలిస్తాను నీ నులివెచ్చని ఊపిరిలో పులకిస్తాను నీ సుతిమెత్తని ఒడిలో పవలిస్తాను నీ నులివెచ్చని ఊపిరిలో పులకిస్తాను నీ నునుపారని నొసట నే ముద్దవుతాను నీ కనుపాపల క్రీనీడా జీవిస్తాను జీవితాన చీకటంతా చెదిరిపోవాలి చెదిరి పోనీ మమతలు మనకు చెరలు కావాలి.. చెరలు కావాలి రాజా... ఓ నా రాజా..రాజా ... ఓ నా రాజా
నీ ఎద లోపలి దీపాన్నై నే ఉంటాను నా కథ నడిపే నాయకుడై నీవుంటావు నీ ఎద లోపలి దీపాన్నై నే ఉంటాను నా కథ నడిపే నాయకుడై నీవుంటావు నా చిరకాలపు కోరికవై నీవుంటావు నీ పరువానికి పండుగనై నే ఉంటాను మల్లెపూల మనసులనే అల్లుకుందాము ఎల్లలన్ని తుడిపివేసి ఏలుకుందాము... ఏలుకుందాము... రాణీ... ఓ నా రాణీ ..రాణీ... ఓ నా రాణీ.. కోటి జన్మల ఆనందం శతకోటి జన్మల అనుబంధం నీవు నేనై వెలిశాము నేడు మళ్ళీ కలిశాము
Advertisement
Song Credits & Details
Singer(s)
బాలు, సుశీల
Movie / Album
రాజా (1976)
Lyricist
ఆచార్య ఆత్రేయ
Music Director
చక్రవర్తి
Language
Telugu
Q&A
Frequently Asked Questions (కోటి జన్మల ఆనందం)
Who sang the song "కోటి జన్మల ఆనందం"?▼
The song "కోటి జన్మల ఆనందం" is sung by బాలు, సుశీల.
Which movie is the song "కోటి జన్మల ఆనందం" from?▼
"కోటి జన్మల ఆనందం" is featured in the movie/album రాజా (1976).