నరకుని రక్షింప పరివార సహితుడై నిటలాక్షుడే వచ్చి నిలచు గాక అతని యానతని కాదనలేక సురలెల్ల శివుని వెన్నంటి వచ్చెదరు గాక గ్రహములు భయమున గతులు దప్పును గాక పంచ భూతము లుజ్జృంభించు గాక భూదేవి యే వచ్చి పుత్రభిక్షాం దేహి యంచు చే సాచి అర్థించుగాక సత్య ధర్మాలు తప్పని జనుల కతడు - సలిపిన పరాభవమ్ములు సమసి పోవ నరకుని శిరంబు భూమి పై బొరల జేతు - ధర్మ సంస్థాపనము జేతు ధరణిలోన.