రయ్ రయ్ రా రా అడ్డే లేని దారై రా రా హద్దే లేని తీరై రా రా దూకేట్టి జోరై రా పోరాడేట్టి పోరై రా నీలో ఆరు నూరై రా మందళ్లొంచి వేరై రా భయ్యం పీకి పారేయ్ రా సిగ్గుంటే సీరై రా జై కొట్టేటి పేరై రా నీ రాక చూసి లోకం చేసే హోరై హోరై హోరై రా రా హద్దే లేని తీరై రా రా రా బెరుగ్గా ఆ బెరుగ్గా ఇరుగ్గా ఆ ఇరుగ్గా పాతేసుకోకోయలా నువ్ నిన్నే నీ లోపలా హే పాతికేళ్లకే నువ్వు పాతబడిపోకురా నిన్నటి లాగే రేపున్నదంటే ఈ రోజేం పీకావనే నీ అయ్య వడ్డి నీ బిడ్డ కడితే నువ్వేమి పొడిచావనే మొండెంలో తల దించేటట్టైతే హే మొలతాడు ఎందుకు కట్టావ్ తెంచేసెయ్ నువ్వు మొత్తం రత్తం మార్చుకొనొచ్చేసెయ్ ఆటనుకోకోయ్ ఆటంటే బతుకోయ్ నీ ఆట బతకాలిరోయ్ మాటనుకోకోయ్ గెలుపంటే వెలుగోయ్ గెలుపై నువ్వెలగాలిరోయ్ మండే గుండె నీలో లేదంటే కాలు చేయి ఉన్నా లేనట్టే నీకే నెగ్గే నైజం అర్థం కానట్టే