చరణం: 1 నిజంలాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి? కలే ఐతే ఆ నిజం ఎలా తట్టుకోవాలీ? ఔనో కాదో అడగకంది నా మౌనం చెలివో శిలవో తెలియకుంది నీ రూపం... చెలిమి బంధమల్లుకుందే జన్మ ఖైదులా !!
ఎదుట నిలిచింది చూడు
చరణం: 2 నిన్నే చేరుకోలేకా ఎటెళ్ళిందో నా లేఖ వినేవారు లేకా విసుక్కుంది నా కేకా నీదో కాదో వ్రాసున్న చిరునామా ఉందో లేదో ఆ చోట నా ప్రేమా... వరం లాంటి శాపమేదో సొంతమైందిలా...