వన్నె చిన్నె లన్నీ వున్న చిన్నదానివే అన్నీ వున్న దానివే ఎన్ని వున్నా జోడు లేక లేనిదానివే - ఏమీ లేనిదానివే- ఉత్త ఆడదానివే
తిరిగే చక్రాలున్నా - పై పైకెగరే గుఱ్ఱాలున్నా కళ్లెం పట్టి కళ్లనుగట్టి నడిపే మొనగాడుండాలి అందని దైనాగానీ నరులందరు కోరుదురందాన్ని తూకం వేసి పాకంచూసి, డెందం ఒకరికే ఇవ్వాలి అందం డెందం కలిపి ఆనందం అర్థం తెలిపే అతగాడొకడు జతయైనపుడు, అన్నీ వున్నవనుకోవాలి